‘నిను వీడని నీడను నేనే’ పబ్లిక్ టాక్


వరుసగా ప్లాపులు పలకరిస్తుండటంతో రెండేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఆ బాధ నుంచి బయటపడటానికి విదేశాలకి వెళ్లాడు. తిరిగొచ్చాక నిర్మాతగా మారి ‘నిన్ను వీడని నీడను నేనే’ సినిమా చేశాడు. ఈ హార్రర్ కామెడీ థ్రిల్లర్
చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రచారంతో సినిమా ప్రేక్షకుల్లో నానేలా చేశాడు సందీప్ కిషన్. మరీ.. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నిను వీడని నీడను నేనే’పై పబ్లిక్ ఏంటీ చూద్దాం పదండీ.. !

ప్రారంభంలోనే సినిమా 2035 సంవత్సంలోకి తీసుకొచ్చాడు. అక్కడ కొన్ని కామెడీ సీన్స్ చూపించేసి.. మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లాడు. సందీప్ కిషన్, అనన్య సింగ్ పరిచయం, పాట, ఓ హత్య తో ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికరంగా ముగించాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. అది సెకాంఢాఫ్ పై అంచనాలని పెంచేసింది.

ఇక, సెకాంఢాఫ్ ని ఓ భాగోద్వేగ సన్నివేశంతో మొదలెట్టారు. మరో హత్య, దాని తాలుకు సస్పెన్స్ ని సినిమాని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చిక్కుముడులని ఒక్కొక్కటి విప్పితూ సినిమాని క్లైమాక్స్ వైపు తీసుకెళ్లారు మొత్తంగా… ఫస్టాప్ ఆసక్తికరంగా సాగినా… అక్కడక్కడ స్లో నేరేషన్ అనిపించింది. సెకాంఢాఫ్ లో కథనంపై దృష్టి సారించారు. ఫైనల్ గా ‘నిను వీడని నీడని నేనే’పై పాజిటివ్ టాక్ నడుస్తోంది.