విజయ్ దేవరకొండ భయం నిజమైంది !


తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాకు దూరంగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ‘దొరసాని’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వరకు పట్టించుకోలేదు. టీజర్ వచ్చినా.. స్పందించలేదు. పాటలు బాగున్నాయని బయట టాక్ వచ్చినా.. విజయ్ నేరు తెరవలేదు. ఈ నేపథ్యంలో తమ్ముడు సినిమాని విజయ్ పటించుకోవడం లేదనే విమర్శలొచ్చాయ్.

ఐతే, దొరసాని ప్రీ రిలీజ్ వేడుకలో తమ్ముడిపై ఉన్న ప్రేమని గుండెల్లో చూపించాడు విజయ్. వేదికపైనే కన్నీరు పెట్టుకొన్నాడు. తమ్ముడు హీరో అవ్వడం తనకి ఇష్టం లేదు. ఇండస్ట్రీ కష్టాలు తనకు తెలుసు. అందుకే దొరసానికి ఇన్నాళ్లు సపోర్ట్ చేయలేదని తెలిపారు. దొరసాని సినిమా చూసిన తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చేందుకు ఒప్పుకొన్నానని అన్నారు. సినిమా బాగుందని కితాబిచ్చారు.

ఐతే, రిలీజ్ తర్వాత దొరసానిపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. కథ పాతదే. దానికి 1980 నేపథ్యం తీసుకొని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పుకొంటున్నారు. దొరసానికి మిక్సిడ్ టాక్ రావడంతో.. విజయ్ దేవరకొండ భయం నిజమైందనే టాక్ వినిపిస్తొంది. అయినా.. సినిమా విడుదల తర్వాత దొరసానికి విజయ్ సపోర్టు ఫుల్లుగా లభిస్తోంది. తాజాగా, దొరసానిపై విజయ్ కామెంట్ చేశాడు.

”యువ నటీనటులను చూసి గర్వపడుతున్నాను. మై బాయ్.. ఐ లవ్యూ సో మచ్. కానీ నీకంటే రాజునే ఎక్కువగా ఇష్టపడుతున్నాను. శివాత్మిక పెర్ఫార్మన్స్ అధ్బుతంగా ఉంది. కథ నిజంగానే జరిగినట్లు తమ పెర్ఫార్మన్స్ తో ఆవిష్కరించిన నటీనటుల కారణంగా సినిమా చూడడానికి అధ్బుతంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. త్వరలోనే మన దారులు కలుస్తాయని అనుకుంటున్నారు. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్” అంటూ ట్విట్ చేశాడు విజయ్.