ప్లాప్ హీరోని నమ్ముకున్న రేణుదేశాయ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ-ఎంట్రీ ఫిక్సయింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా నిర్థారించారు. సినిమాలో రేణు దేశాయ్ పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన ఓ గజదొంగ జీవితం ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయ్. ఫైనల్ గా బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా ఫిక్సయ్యారు.
ఇక, పవన్ తో విడిపోయిన తర్వత రేణుదేశాయ్ పూణేలో ఉంటున్నారు. పూర్తిగా పిల్లలపైనే దృష్టిపెట్టారు.

లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగా.. దర్శకురాలిగా మారి ఓ మరాఠీ సినిమా చేశారు. అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కొన్ని కవితలు కూడా రాశారు. మంచి కథ దొరికితే నటిగా రీ ఎంట్రీ ఇస్తానని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.