న్యూజిలాండ్’కు స్ట్రోక్


ప్రపంచకప్ ఫైనల్ లో న్యూజిలాండ్ కు స్ట్రోక్ తప్పేలా లేదు. మొదటి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. నికోల్స్(55), లేథమ్‌(47), విలియమ్సన్‌(30) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో కెట్‌, వోక్స్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

ఇక, 241 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కాపాడుకొనేలా కనిపించింది. ప్రారంభంలో బౌల్ట్‌, హెన్రీల కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ కు పరుగులు చేయడమే కష్టమైంది. ఐతే, కాస్త కుదురుకున్నాక రాయ్ బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో హెన్రీ వేసిన అద్భుత బంతికి లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 16.3 వద్ద రూటు వికెట్ కోల్పోయింది. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 60/2. ఫెర్గూసన్‌ వేసిన 19.3వ బంతికి జానీ బెయిర్‌ స్టో (36; 55 బంతుల్లో 7×4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. నీషమ్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌(9) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. 25 ఓవర్లకి ఇంగ్లాండ్ స్కోర్ 93/4. క్రీజులో బట్లర్‌(5), స్టోక్స్‌(7) ఉన్నారు.

ఆ తర్వాత బట్లర్‌, స్టోక్స్ జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లాండ్ ని విజయతీరాలకి చేర్చే పనిలో ఉన్నారు. బట్లర్ (53), స్టోక్స్‌(50) అర్ధశతకాలు పూర్తి చేశారు. 44 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 189/4. మొత్తంగా కివీస్ కు స్టోక్స్ స్ట్రోక్ తప్పేలా లేదు. అదే జరిగితే.. ఇంగ్లీష్ జట్టు తొలిసారి ప్రపంచకప్ ని ముద్దాడబోతుంది.