ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్


ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ సూపర్ విజయాన్ని సాధించింది. ఫలితం సూపర్ ఓవర్ లో కానీ తేలలేదు. మునుపెన్నడూ చూడన్నంత ఉత్కంఠభరితంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. ఫైనల్ గా ఇంగ్లాండ్ ని వరించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

ఇక, ఆరంభంలో ఇబ్బందిపడ్డ ఇంగ్లాండ్ జట్టు ఓ దశలో ఈజీగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. బట్లర్ 53 అవుటైన తర్వాత పరిస్థితి మారింది. ఓ వైపు స్టోక్స్ అదరగొడుతున్నా.. మరోవైపు వరుస వికెట్స్ పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్ లో ఇంగ్లాండ్ కు 15 పరుగులు అవసరం కాగా.. 14 పరుగులు మాత్రమే చేసింది. సరిగ్గా 241 పరుగుల వద్ద ఆలవుట్ అయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యం అయింద్.

సూపర్ ఓవర్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 16 పరుగులు చేసింది. ఇక, సూపర్ ఓవర్ ను కివీస్ దీటుగానే ఆరభించింది. తొలి రెండు బంతుల్లోనే 9 పరుగులు రాబట్టింది. ఐతే, ఆఖరి మూడు బంతులు ఆర్చర్ అద్భుతంగా విసరడంతో కివీస్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.