నేటి చంద్రగ్రహణం ప్రత్యేకతలు


ఈరోజు పౌర్ణమి. గురు పౌర్ణమి. అందులోనూ చంద్రగ్రహణం వస్తోంది. ఈ చంద్రగ్రహణానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఆషాఢ పౌర్ణమి అంటే గురుపౌర్ణమి రోజున వస్తున్న చంద్రగ్రహణం ఇది. గతంలో 1870వ సంవత్సరం జులై 12న ఇలాంటి గురుపౌర్ణమి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకి అదేవిధమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది.

ఈ చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో ఏర్పడి.. రెండో పాదంలో ముగుస్తుంది. అర్థరాత్రి 1.30 నిమిషాలకు ధనుస్సు రాశిలో ప్రారంభమయి.. తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే మనకు కనిపిస్తుంది.

ఇక, చంద్రగ్రణం రోజున పాటించాల్సిన ప్రత్యేక నియమాలు ఏమీ లేవని పండితులు చెబుతున్నారు. ఎప్పటిలాగే గ్రహణం పట్టినరోజున పాటించే పద్దతులు పాటిస్తే మంచింది. గ్రహణ సమయానికి సుమారు 4 గంటల ముందే.. భోజనం పూర్తి చేయాలి. గ్రహణం తర్వాత గ్రహణ స్నానం చేయటం ఉత్తమం. మంత్రోపదేశం తీసుకున్నవారు గ్రహణసమయంలో మంత్రానుష్టానం చేయటం ఎంతో మంచిదిని పండితులు చెబుతున్నారు. ఇక, గ్రహణం నేపథ్యంలో పలు దేవాలయాలని మూసేయనున్నారు.