ప్రకటన : టీమిండియాకు కోచ్ కావలెను


టీమిండియా కోచింగ్‌ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ ప్రకటన వెలువరించింది. రవిశాస్త్రి, అతడి సహాయక బృందం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పదవులకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.

ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసే వ్యక్తికి బీసీసీఐ మూడు షరతులు విధించింది. ఏదైనా టెస్టు జట్టుకు జట్టుకు రెండేళ్లు లేదా అసిసోయేట్‌ జట్టు/‘ఎ’/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు కోచ్‌గా పని చేసి ఉండాలి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవమూ ఉండాలి. వయసు 60 మించకూడదు. సహాయ కోచ్‌లు 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడి ఉండాలి. వయసు, కోచింగ్‌ అనుభవం విషయంలో మాత్రం ప్రధాన కోచ్‌ పదవికి పెట్టిన షరతులు వీళ్లకూ వర్తిస్తాయి. జులై 30 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.