ఇకపై తేజుతో కష్టం !


మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు విజయం విలువ బాగా తెలిసొచ్చింది. గతంలో రొటీన్ సినిమాలతో ప్రేక్షకులకి బోర్ కొట్టించాడు. వరుసగా మాస్-యాక్షన్ కథలతో మూసదారిలో వెళ్లాడు. ఫలితంగా వరుసగా ప్లాపులు పలకరించారు. ఐదారు సినిమాలు ఫట్టుమన్నాయ్. ఈ నేపథ్యంలో ఆయన కసితో చేసిన ‘చిత్రలహరి’ ఫలితానిచ్చింది.

చిత్రలహరి హిట్ తర్వాత ప్లాపులు ధైర్యాన్ని ఇచ్చాయి. ఇకపై కథ నచ్చకపోతే.. సినిమా చేయను అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చాయని అన్నారు తేజు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రస్తుతం తేజు మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. కాస్త గ్యాప్ తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ లో తేజు ఓ నాలుగు కథలు విన్నాడట. ఇందులో ఏ ఒక్కదాని ఒకే చేయలేదట.

విన్న నాలుగు కథల్లో తేజుకి ఓ కథ నచ్చింది. ఐతే, అది తనకు సూట్ కాదని చెప్పి సున్నితంగా తిరస్కరించాడట. తేజుకి కథలు వినిపించిన దర్శకుల్లో కొత్త దర్శకులు, పేరున్న దర్శకులు కూడా ఉన్నారట. తేజు మాత్రం దర్శకుడిని చూడటం లేదట. ఆయన చెప్పిన కథని మాత్రమే చూస్తున్నారంట. మునుపటిలా తొందరపడి కథని ఓకే చేసేది లేదని చెబుతున్నాడట. తేజు ముందు చూపుతో ఇకపై ఆయన్ని ఒప్పించడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.