ఓవర్‌ త్రో పరుగులు మాకొద్దు


ఓవర్ త్రో తో వచ్చిన నాలుగు పరుగులు మాకొద్దని అంపైర్లను కోరాడట ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ హోరాహోరీ ఫైనల్లో తలపడ్డ సంగతి తెలిసిందే. ఛేదనలో ఇంగ్లాండ్ చివరి ఓవర్‌ నాలుగో బంతిని స్టోక్స్‌ ఆడాడు. మైదానంలో బంతి అందుకున్న మార్టిన్‌ గప్తిల్‌ కీపర్‌ వైపు విసిరాడు. అంతలోనే రెండో పరుగు కోసం క్రీజులోకి డైవ్‌ చేసిన స్టోక్స్‌ బ్యాటుకు బంతి తగిలింది. నేరుగా బౌండరీ దాటింది. అనుకోకుండా ఇలా జరగడంతో అంపైర్లు 2+4 మొత్తం 6 పరుగులు ఇంగ్లాండ్‌ ఖాతాలో జమచేశారు.

ఆ సమయంలో బెన్‌స్టోక్స్‌ అంపైర్ల దగ్గరకు వెళ్లి ‘మీరు ఆ నాలుగు పరుగుల్ని తీసేస్తారా? అవి మాకొద్దు’ అని అడిగాడట. కానీ నిబంధనల్లో అలా ఉందని ఎంపైర్లు చెప్పారట. ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అండర్సన్‌ తెలిపాడు. నిజంగానే స్టోక్స్ అడిగిన ఆ నాలుగు పరుగుల్ని తీసేసి ఉంటే.. న్యూజిలాండ్‌ విశ్వవిజేతగా అవతరించేది.