ఆరోగ్య శ్రీ.. కొత్త కండీషన్ !


ఆరోగ్య శ్రీ పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక. ఈ పథకంతో పేద ప్రజలు సైతం కార్పోరేట్ వైద్యాన్ని పొందుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తరిస్తారని.. సంస్కరిస్తారని ప్రజలు ఆశపడ్దారు. కానీ, అందుకు భిన్నంగా కొత్త కండీషన్ ఒకటి పెట్టారు. ఇకపై నెలకు రూ.40వేలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని మంత్రి బుగ్గన అసెంబ్లీలో తెలిపారు.

శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆర్థికమంత్రి బుగ్గన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో పింఛన్ల కోసం అధిక నిధులు కేటాయించామని.. పింఛన్లకు రూ.15,868 కోట్లు కేటాయించామన్నారు. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.11వేల కోట్లు కేటాయించి రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిదన్నారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ కింద రూ.3వేల కోట్లు కేటాయించామన్నారు.