టీఆర్ఎస్ తో పొత్తుపై ద‌త్త‌న్న మాట‌..

మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేపథ్యంలో పార్టీల మ‌ధ్య పొత్తుల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే టీడీపీ, టీఆర్ఎస్ పొత్తుల‌పై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీలో టీడీపీ , బీజేపీ పొత్తు ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ ఆ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయ‌ని మొద‌ట్లో భావించారు. అయితే తెలంగాణ‌లో బీజేపీతో పొత్తు విష‌యంలో టీడీపీ ఇంకా డైలామాలో ఉంద‌ని కేంద్ర మాజీమంత్రి బండారు ద‌త్తాత్రేయ ఓ కార్య‌క్ర‌మంలో అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందంటూ కొన్ని చోట్ల ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీతో ఎదుగుతున్న క్ర‌మంలో ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామ‌ని ద‌త్తాత్రేయ ప్ర‌శ్నించారు. 2019ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.టీడీపీలో కొంత మంది నేత‌లు టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, పార్టీని చ‌క్క‌బెట్టేందుకు చంద్ర‌బాబు ఎంతో ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంటరిగానే పోటీ చేస్తామ‌ని ద‌త్తన్న చెప్పుకొచ్చారు.