ఈ నెల 22నే చంద్రయాన్‌-2 ప్రయోగం

చంద్రయాన్‌-2 ప్రయోగానికి కొత్త డేటు ఫిక్సయింది. నెల 15వ తేదీ వేకువ జామున చంద్రయాన్‌-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు… క్రయోజనిక్‌ ఇంజిన్‌ ట్యాంకర్‌లోని ప్రెజర్‌ బాటిల్‌లో లీకేజీ ఏర్పడటంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. క్రయోజనిక్‌ ఇంజిన్‌ ట్యాంకర్‌లో ప్రెజర్‌ బాటిల్‌ లీకేజీ వల్లే 30 నుంచి 320 బార్లు ఉన్న పీడనం 290కు పడిపోవడం కారణంగా సమస్య తలెత్తింది. ఇప్పుడా లోపాన్ని సరిచేశారు.

“సాంకేతిక కారణాలతో జులై 15న నిలిచిపోయిన చంద్రయాన్‌ – 2ను ప్రయోగాన్ని తిరిగి జులై 22(సోమవారం) మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నాం” అని ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. 20 గంటల పాటు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిర్వహించాక… జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నింగిలోకి చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనుందని చెబుతున్నారు.