రివ్యూ : ఇస్మార్ట్ శంకర్ – మాస్ హిట్
చిత్రం : ఇస్మార్ట్ శంకర్ (2019)
నటీనటులు : రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మీ
రిలీజ్ డేటు : 18 జులై, 2019
రేటింగ్ : 3.5/5
ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రేక్షకుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సినిమాలు చేశాడు. హీరో అంటే ఇలా ఉండల్రా అన్న విధంగా హీరోయిజం చూపించాడు. పూరి దర్శకత్వంలో సినిమా అంటే హీరోలకి చాలా ప్రత్యేకం. అందుకే స్టార్ హీరోలు పూరి కోసం క్యూ కట్టేవారు. ఐతే, ఇప్పుడు పూరికి ఆ ప్రభ లేదు. ఆయన ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. తనదైన మార్క్ చూపించేందుకు ఆయన ఈసారి ఎనర్జిటిక్ హీరో రామ్ ని ఎంచుకొన్నాడు. ఆయన్ని ఇస్మార్ట్ శంకర్ గా రెడీ చేశాడు. హైదరాబాద్ కుర్రాడి కథ ఇది. టీజర్, ట్రైలర్’లని చూస్తే దిమాక్ ఖరాబ్ అయింది. మరీ సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉందా? రివ్యూలో చూద్దాం పదండీ!
కథ :
హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు శంకర్ (రామ్). సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. ఓ డీల్ విషయంలో పరిచయమైన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. అదేసమయంలో జరిగిన పొలిటీషియన్ కాశీ రెడ్డి హత్యకేసులో జైలుకి వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంది సైంటిస్ట్ పింకీ (నిధి అగర్వాల్). ఇంతకీ అలా ఎందుకు చేసినట్టు ? నిజంగానే కాశీరెడ్డిని శంకరే చంపాడా? సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్)తో శంకర్ కి సంబంధం ఏంటి ? అనేది ఇస్మార్ట్ శంకర్ కథ.
ప్లస్ పాయింట్స్ :
* కథ
* రామ్ నటన
* నేపథ్య సంగీతం
* క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
* కథనం
* ఫస్టాఫ్
ఎలా ఉందంటే ?
దర్శకుడు పూరి ఆకలితో ఉన్నాడు. ఆయనకి అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకోసం ఆయన ఈసారి స్వీడుని తగ్గించుకొన్నాడు. మునుపటిలా జెడ్ స్వీడుతో సినిమా కాకుండా ఇస్మార్ట్ శంకర్ ని తాపీగా చెక్కాడు. ఫ్రెష్ కథని ఎంచుకొన్నాడు. రామ్ ని కత్తిలా తయారు చేశాడు. ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్స్ తీసుకొన్నాడు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేశాడు. తెలంగాణ యాస, బాషతో రక్తికట్టించాడు. కానీ, కథనం రొటీన్. ఫలితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిన ఇస్మార్ట్ శంకర్ ని హిట్ దగ్గరే ఆగిపోయాడు. ఈ హిట్ తో పూరి దావత్ చేసుకోవాల్సిందే.
ఎందుకంటే ? ఈ మధ్య వచ్చిన పూరి సినిమాల కంటే ఇస్మార్ట్ శంకర్ చాలా బెటర్. ఫస్టాఫ్ ని సాదాసీదాగా తీసిన పూరి.. సెకాంఢాఫ్ లో మాత్రం దిమాక్ ఖరాబ్ చేసిండు. క్లైమాక్స్ అదిరిపోయింది. అదే సినిమాని నిలబెట్టింది. అద్భుతమై ట్విస్టుతో కథని క్లైమాక్స్ కి తీసుకెళ్లాడు. అదేంటీ ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. మొత్తంగా.. దర్శకుడుగా పూరి ఈసారి పాసపైపోయాడు. హిట్ క్రెడిట్ మాత్రం హీరో రామ్ దే.
ఎవరెలా చేశారంటే ?
రామ్ ఎనర్జిటిక్ హీరో. ఇందులో ఆయన ఎనర్జి వంద రెట్లు అధికంగా ఉంటుంది. రామ్ మేకవర్ అదిరిపోయింది. డైలాగులు, డ్యాన్స్, నటనలో ఇరగదీశాడు. ఈ సినిమా హిట్టయితే.. ఆ క్రెడిట్ సింహాభాగం రామ్ దే. ఇక, మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. తన మార్క్ నేపథ్య సంగీతంతో మణిశర్మ ప్రేక్షకులకి పూనకం తెప్పించాడు.
హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటాషా అందాలు ఆరబోయడంలో పోటీపడ్డారు. నటనలోనూ వీరు ఆకట్టుకొన్నాడు. నభా చెప్పిన కొన్ని మాస్ డైలాగ్స్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడ్డాయ్. సత్యదేవ్ కనిపించేది కొద్దిసేపే అయినా.. నటనతో ఆకట్టుకొన్నాడు. విలన్ గ్యాంగ్.. ఇతర నటీనటులు తమ తమ పరిథి మేరకు నటించారు.
సాంకేతికంగా :
ఇస్మార్ట్ శంకర్ పాటలు వింటేనే పూనకం వచ్చేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఆ రేంజ్ లోనే ఇచ్చారు మణిశర్మ. సెకాంఢాఫ్ లో నేపథ్య సంగీతం అదిరిపోయింది. కొన్ని సన్నివేశాలని నేపథ్య సంగీతం డ్యామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టాఫ్ సినిమా కాస్త స్లో అనిపించినా.. సెకాంఢాఫ్ లో పరుగులు పెట్టింది. దీంతో ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరగా : ఇస్మార్ట్ శంకర్.. మాస్ హిట్ !
రేటింగ్ : 3.5/5