విశ్వాసపరీక్ష.. ఓ థ్రిల్లర్ సినిమా !


కర్ణాటక రాజకీయ సంక్షోభం థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. క్షణానికో మలుపు తిరుగుతోంది. తమ ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు సీఎం కుమారస్వామి ఈ ఉదయం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఐతే సభలో గందరగోళ పరిస్థితి నేపథ్యంలో సభ వాయిదాల పర్వం కొనసాగుతోంది.

విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు సంకీర్ణం ఎత్తులు వేస్తోందని భాజపా దుయ్యబట్టింది. మరోవైపు, తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా భాజపా కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ శివకుమార్‌ ఆరోపించారు. మా పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కలిసే ప్రయాణం చేశారు. అందులో ఒకరైన శ్రీమంత్‌ పాటిల్‌ ఇలా హాస్పిటల్‌ స్ట్రెచర్‌పై కన్పించారు. మరి మిగతావారు ఏమయ్యారు. మా ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని శివకుమార్‌ స్పీకర్‌ను కోరారు. స్పీకర్ కూడా అసమ్మతి ఎమ్మెల్యేల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు.