ఏపీకి హ్యాండిచ్చిన వరల్డ్ బ్యాంక్
బ్యాంకులకి బాస్ వరల్డ్ బ్యాంక్ వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సుస్థిర అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకుంది. దీనికి కారణం సీఎం జగన్ పరిపాలన విధానాలు కాదు. రాజధాని నిర్మాణం తమ జీవనాధారానికి హని చేస్తోందని, పర్యావరణానికి, ఆహార భద్రతకు ఇది భంగం కలిగిస్తోందంటూ రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు గతంలో వరల్డ్ బ్యాంక్ తనిఖీ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీకి సాయం విషయంలో తటపటాయించిన వరల్డ్ బ్యాంక్.. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్ట్ నుంచే తప్పుకొంది. ఐతే, దీనికి ఇంకా తమకి అధికారిక సమాచారం అందలేదని సీఆర్డీఏ తెలిపింది. కాగా, అమరావతి అభివృద్ధి కోసం 715 డాలర్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగా 300 మిలియన్ డాలర్లు మాత్రమే రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకం ప్రాజెక్ట్ నుంచే తప్పుకొంది. దీనిపై ఏపీ సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది చూడాలి