ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్
క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది. సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డోనాల్డ్, ఆసీస్ మాజీ మహిళా క్రికెటర్ క్యాథిరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు ఈ అవకాశం లభించింది. అలాగే మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో క్రికెటర్, ఆసీస్ మాజీ పేసర్ ఫిట్జ్‌పాట్రిక్ సైతం ఈ గౌరవం దక్కింది.
లండన్‌లో నిర్వహించిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో సచిన్ పాల్గొని మాట్లాడారు. తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక, సచిన్ కన్నా ముందు బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్ గవాస్కర్(2009), కపిల్‌దేవ్(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) ఈ ఘనత దక్కించుకున్నారు.