ఇస్మార్ట్’కు కామ్రేడ్ భయం
వరుస ప్లాపుల్లో ఉన్న దర్శకుడు పూరి.. ఈసారి ఇస్మార్ట్ ఆలోచన చేశాడు. ఈ మధ్య పెద్ద డైరెక్టర్, పేరున్న హీరో నుంచి మాస్ చిత్రం రాలేదు. ఆలోటుని ‘ఇస్మార్ట్ శంకర్’తో పూడ్చేశాడు. హీరోయిన్లు నభా నటాషా, నిధి అగర్వాల్ లతో పాటు హీరో రామ్ ని ఓ ఐటమ్ లా చూపించాడు పూరి. అది ప్రేక్షకులకి కిక్కునిచ్చింది. ఫలితంగా ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
సినిమా బిజినెస్ విషయంలోనూ ఇస్మార్ట్ గా ఆలోచించారు. చాలా తక్కువ ధరకు రూ. 15కోట్లకి మాత్రమే అమ్మారు. ఆ మొత్తం రెండ్రోజుల్లోనే వచ్చేశాయి. డ్రిస్టిబ్యూటర్స్ హ్యాపీ. దీంతో కమర్షియల్ హిట్ కొట్టామనే చిత్రబృందం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. అదే రూ. 25-30 కోట్లుకు అమ్మివుంటే ఈ ఆనందం మిగిలేది కాదు. పైగా వచ్చేవారం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రిలీజ్ కానుంది.
యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ బాగున్నా కష్టాలు తప్పేవి కాదు. ఇప్పటికీ కూడా జోరుమీద ఇస్మార్ట్ శంకర్ పై కామ్రేడ్ ఎఫెక్ట్ గట్టిగానే పడేలా కనిపిస్తోంది. ప్రస్తుత వసూళ్లు చూస్తే.. ఇస్మార్ట్ కలెక్షన్స్ రూ. 50కోట్లు ఈజీగా దాటేసేలా కనిపిస్తోంది. కానీ, డియర్ కామ్రేడ్ ఎంట్రీతో పరిస్థితి మారడం ఖాయం. ఇస్మార్ట్ కలెక్షన్స్ కి కామ్రేడ్ గండికొట్టడం పక్కా అని చెబుతున్నారు. మరీ.. చూడాలి కామ్రేడ్ డ్యామేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. !