ఒక లైటు, ఒక ఫ్యాను.. కరెంట్ బిల్లు మాత్రం రూ.128కోట్లు !


వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాపూర్‌ పరిధిలోని ఛామ్రీ గ్రామానికి చెందిన షామీమ్‌ అనే నిరుపేదకు ఏకంగా రూ.128 కోట్లలను విద్యుత్‌ బిల్లు వచ్చింది. దీనిఅపి అధికారులని నిలదీసిన ఆ మొత్తం కట్టితీరాల్సిందేనన్నారు. దీంతో.. షామీమ్‌ మీడియాని ఆశ్రయించడంతో.. ఈ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

“ఒక లైటు, ఒక ఫ్యాను ఉపయోగించుకుంటాం. మేం నెల మొత్తం 2కిలో వాట్స్‌కి మించి వాడం. వాటికి ఎంత ఎక్కువ వేసినా బిల్లు రూ.700-800 దాటదు. కానీ రూ.128 కోట్లు మేం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెల్లించాలి?. నా జీవితం మొత్తం కష్టపడినా నేనంత మొత్తాన్ని సంపాదించలేను. ఎన్నిసార్లు నా సమస్యను అధికారులకు విన్నవించుకున్నా మమ్మల్ని పట్టించుకోలేదు. మొత్తం బిల్లు కట్టితీరాల్సిందేనని నోటీసులు కూడా పంపారు. ఇది నా ఇంటి వరకే వచ్చినట్లు లేదు. రాష్ట్రం మొత్తం బిల్లు నాతోనే కట్టించాలనుకున్నారేమో. నాకు న్యాయం చేయండి’ అన్నారు షామీమ్‌. దీనిపై విద్యుత్‌ శాఖ ఇంజినీర్‌ రామ్‌ శరణ్‌ను వివరణ కోరగా సాంకేతిక లోపాల కారణంగా అలా వచ్చి ఉండొచ్చని.. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.