నభా.. ఇలియానా 2.ఓ !


టాలీవుడ్ కు మరో ఇలియానా దొరికేసింది. ఆమె ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటాషా. నభా.. ఇలియా 2.ఓ అని వెర్షన్ అని వర్మ అభిప్రాయపడ్డారు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో గుర్తింపు పొందిన నభా తర్వాత ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో నటించారు. పార్టీలో నభాతో కలిసి దిగిన సెల్ఫీని వర్మ తన ట్విటర్‌లో ఖాతాలో షేర్ చేశారు. “ఇస్మార్ట్‌ శంకర్‌’ చూసిన తర్వాత నభా నటేష్‌ ఇలియానా 2.ఓ అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు’ అని ప్రశంసించారు.

దీనికి నభా ధన్యవాదాలు తెలిపారు. ‘ధన్యవాదాలు సర్‌.. మీరు సినిమా చూసి ఎంజాయ్‌ చేయడం సంతోషంగా ఉంది. మీ సినిమాలకు నేను పెద్ద అభిమానిని. అలాంటి మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. దీనికి వర్మ ప్రతిస్పందించారు. ‘నిన్ను కలవడం నాకూ ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి నేను నీ అభిమానిని’ అని పేర్కొన్నారు.

రామ్ ‘దేవదాస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇలియానా. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆదిపాడింది. టాలీవుడ్ లో తొలిసారి కోటి రూపాయాలు అందుకొన్న కథానాయికగా రికార్డ్ సృష్టించింది. ఇక్కడ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ ఒకట్రెండు విజయాలు అందుకొంది. మంచి నటి అనిపించుకొంది. కానీ, బిజీ హీరోయిన్ కాలేకపోయింది. గత యేడాది రవితేజ అమర్ అక్భర్ అంటోనీ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఇల్లీకి తెలుగులో మరో అవకాశం రాలేదు. ఇప్పుడు ఇల్లీ ఖాళీ. నభా రూపంలో మనకు ఇల్లీ 2.ఓ దొరికేసింది.. !