పూరీ-ఛార్మి గొడవపై స్పందించిన రామ్ !
హీరోయిన్ ఛార్మీతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ది ప్రత్యేకమైన బంధం. హీరోయిన్ గా సినిమాలు మానేసిన తర్వాత ఛార్మీ పూరితో ఉంటుంది. ఆయనతో కలిసి సినిమా నిర్మిస్తోంది. వీరి తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఐతే, ఈ సినిమా షూటింగ్ సమయంలో పూరి, ఛార్మీల మధ్య గొడవ జరిగింది. దాని భరించలేక హీరో రామ్ విదేశాలకి చెక్కేశారని ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురింది.
అంతేకాదు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు గానూ హీరో రామ్ కి సగం పారితోషికం మాత్రమే ఇచారు. సంగీత దర్శకుడు మణిశర్మకి ఇంకా పూర్తి పారితోషికం ముట్టలేదని రాశారు. దీనిపై రామ్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ‘ఈ వార్త చూసి పడిపడి నవ్వుకున్నా. ఇలాంటి తప్పుడు వార్తలకు సాధారణంగా నేను స్పందించను. కానీ, ఈ వదంతు మాత్రం సూపర్. ‘బంగారం అండీ వీళ్లు..’’ అంటూ పూరీ, ఛార్మిని ట్యాగ్ చేశారు. ఇక, ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని చిత్రబృందం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోంది.