బ్రేకింగ్ : చంద్రయాన్2 ప్రయోగం విజయవంతం
భారత్ అంతరిక్ష చరిత్రలో విజయం. ‘చంద్రయాన్ 2’ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 ఎం1 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలో సంబరాల్లో మునిగిపోయారు. దేశం గర్వంతో ఉప్పొంగిపోతోంది.
ముందుగానే నిర్దేశించినట్టుగా శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం 20 గంటల కౌంట్‌డౌన్ పూర్తిచేసుకొని మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.
సాంకేతిక కారణాలతో జులై 15న నిలిచిన ప్రయోగం ఎట్టకేలకు అన్ని సవాళ్లను అధిగమించింది. కేవలం ఒక నిమిషం మాత్రమే ఉన్న లాంఛ్ విండోను గత అనుభవంతో శాస్త్రవేత్తలు సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో వినియోగించుకోవడంలో సఫలమయ్యారు.