మీడియాపై ప్రశాంత్ కిషోర్ ఫైర్

రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కి మీడియాపై కోపం వచ్చింది. ఆయన తనదైన శైలిలో మీడియాపై సటైర్స్ వేశారు. ‘నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. వార్తా పత్రికల్లో చదవి తెలుసుకోవాల్సి వస్తోంది’ అన్నారు. ప్రశాంత్ కిషోర్ కోపానికి కారణం ఏంటీ ? అంటే.. కొన్ని రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన నేత ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రశాంత్‌ పనిచేస్తున్నారని ఓ మీడియా రాసింది. జన ఆశీర్వాద్‌ యాత్ర పేరుతో చేపట్టే కార్యక్రమానికి ప్రశాంత్‌ వ్యూహకర్త అని అందులో పేర్కొంది. ఈ కథనంపై ప్రశాంత్ కిషోర్ సీరియస్ గా స్పందించారు.

‘తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి వార్తల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. వార్తా పత్రికల్లో చదవి తెలుసుకోవాల్సి వస్తోంది’ అన్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా విజయం కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. విజయవంతం అయ్యారు. ఆయన వ్యూహాలు ఫలించి ఏపీలో వైకాపా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి కోసం పని చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే పని మొదలెట్టారు.