వాట్సాప్‌’లో కొత్త ఆప్షన్ !

వాట్సాప్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా వాట్సాప్‌లో వీడియో, రాతరూప సందేశాలు పంపేముందు ఒకసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల తప్పుడు సందేశాలు పంపే అవకాశం ఉండదు. కానీ సంక్షిప్త అడియో సందేశాలను పంపే ముందు వాటిని మరోసారి సరిచూసుకునేందుకు అవకాశం ఉండదు. నేరుగా అవతలి వ్యక్తికి చేరుకుంటాయి.

ఆ రికార్డింగ్‌లో పొరపాట్లు జరిగితే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడా ఇబ్బందులని తొలగించేందుకు వాట్సాప్ కొత్త ఆప్షన్ ని తీసుకొచ్చే పనిలో ఉంది. ఆడియో రికార్డింగ్‌ సందేశం పంపేముందు పరిశీలించుకునే విధంగా యాప్‌లో మార్పులు చేస్తోంది. ఈ ఫీచర్‌ ఐవోఎస్‌లో బీటా దశలో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.