సల్మాన్‌ పర్‌ఫెక్ట్‌ డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ ఎవరో తెలుసా ?


పెళ్లికానీ ప్రసాదుల లిస్టులో నెం.1 బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఆయనకి ఇప్పటి వరకు లైఫ్‌ పార్ట్‌నర్‌ దొరకలేదు. కానీ ఫర్ ఫెక్ట్ డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ దొరికేశారు. ఆమె ఎవరో కాదు సల్మాన్‌ తల్లి సల్మా. తన తల్లితో కలిసి చీప్‌ థ్రిల్స్‌ అనే ఫేమస్‌ పాటకు సల్మాన్‌ డ్యాన్స్‌ చేశారు. ఆమె చెయ్యి పట్టుకుని అటూ తిటూ తిరుగుతూ, ఆలింగనం చేసుకుని స్టెప్పులేశాడు. ఈ వీడియోని సల్మాన్ తన
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఇక చాలు డ్యాన్స్‌ చేయడం ఆపు అని అమ్మ అంటోంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు పది లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ‘సల్మాన్‌ పర్‌ఫెక్ట్‌ డ్యాన్స్‌ పార్ట్‌నర్‌ ఈమే’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ ‘దబాంగ్‌ 3’ సినిమాతో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

Mom is saying band karo yeh naach ganna..

A post shared by Salman Khan (@beingsalmankhan) on