కుర్ర హీరోలకి విజయ్ దేవరకొండ వార్నింగ్ ?

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ మాటలకి మొహ మాటం ఉండదు. ఆయన సినిమాల్లో కనిపించినంత బోల్డ్ గా మాట్లాడేస్తుంటాడు. అదే ఆయన్ని జనాలకి మరింత దగ్గర చేసింది. స్టార్ హీరోని అవ్వడం వెనక విజయ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. పెళ్లి చూపులు సినిమాకు ముందు విజయ్ ఓ అనామకుడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరోలు సైతం విజయ్ ని ఫాలో అవుతున్నారు.

దీనిపై ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఆసక్తిగా స్పందించారు. ‘నా గెడ్డం, నా వేషాలు.. తెరపై ఇవే కనిపిస్తాయి. కానీ ఎన్ని ఆలోచనల తరవాత అవి పుట్టి ఉంటాయో ఎవ్వరికీ అర్థం కాదు. ఆలోచనల్లో నిజాయతీ ఉండాలి. అందుకు సొంత తెలివితేటలు వాడాలి. నన్ను అనుసరించినంత మాత్రాన అందరూ విజయ్‌దేవరకొండలు కాలేరు’ అన్నారు విజయ్. విజయ్ మాటలు కుర్ర హీరోలకి వార్నింగ్ లా అనిపించొచ్చు. కానీ, విజయ్ చెప్పిన మాటల్లో నిజం ఉంది. ఏ కథానాయకుడు అయినా.. తనకంటూ సొంత స్టయిల్ ని ఏర్పర్చుకొంటే మంచిది. అప్పుడే రాణిస్తారు. ఇదే విజయ్ చెప్పాడు. ఆయన స్టయిల్ లో. అంతే..!