సూర్య బర్త్ డే.. అభిమానుల హంగామా చూశారా ?


కోలీవుడ్ స్టార్ సూర్య 44వ పుట్టినరోజుని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. సూర్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేశారు.

సూర్య మంచి మనసును గుర్తు చేసుకున్నారు. నగ్మా, రాధిక, దేవిశ్రీ ప్రసాద్‌, సెల్వరాఘవన్‌, మనోబాలా తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు. ఇక, సూర్య ఇంటి వద్ద భారీగా అభిమానులు చేరుకొన్నారు. వారిని సూర్య కలిసి ముచ్చటించారు. అందరితో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు.