బిగ్‌బాస్‌ కేసు : ముగ్గురికి ముందస్తు బెయిల్

ప్రారంభానికి ముందే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-3పై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది. సభ్యులను ఇబ్బంది పెడుతున్నారంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో కార్యక్రమ నిర్వాహకుడు శ్యాంతో పాటు రవికాంత్‌, రఘు, శశికాంత్‌లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న వారు బుధవారం నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిలు పొందారు.

అగ్రిమెంట్ తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం వ్యవహార శైలి తనని షాక్ కి గురిచేసిందని శ్వేతారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. గేమ్ వివరాలను చెబుతానని పిలిచిన కోఆర్డినేటర్.. షోలో పార్టిసిపేట్ చేయడం మీకు ఇంటరెస్ట్ ఉందా..?, మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలలి ?, మీరుషోలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు ?, మీరు మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు ? అనే ప్రశ్నలు అడిగారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక, గాయత్రిని వందరోజులు సెక్స్ కి దూరంగా ఉండగలరా ? అంటూ ప్రశ్నించారని వాపోయింది. ఐతే, ఈ వివాదాలన్నీ దాటుకొని బిగ్ బాస్ 3 గత వారం ప్రారంభం అయింది. నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.