విజయ్ షాకింగ్ డిసిషన్.. నటనకి గుడ్ బై !


యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ అప్పుడే రిటైర్డ్మెంట్ గురించి ఆలోచిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘నేను ఎప్పుడైనా నటనకు స్వస్తి పలకొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేసిందే చేస్తున్నానిపించి బోర్‌ కొట్టినా వెంటనే యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను’ అన్నారు విజయ్. ఆయన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్.. తాను ఎప్పుడైనా నటనకి గుడ్ బై చెప్పొచ్చని షాక్ ఇచ్చారు.

ఇక, పెళ్లెప్పుడు అంటే ? ఇప్పుడే కాదు. మరో ఐదేళ్లు ఆగాలి. నాకు 35 వచ్చాక చేసుకోవాలని అనుకుంటున్నానన్నారు విజయ్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రష్మిక మందన కథానాయిక. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం), యష్‌ రంగినేని నిర్మాతలు. దక్షణాది అన్నీ బాషల్లోనూ డియర్ కామ్రేడ్ రేపే రిలీజ్ కానుంది. ఈ సినిమా తనకి స్పెషల్ అని విజయ్ చెబుతున్నాడు. హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.