‘గ్యాంగ్ లీడర్’ టీజర్.. ట్రెండింగ్ నెం.1

నేచురల్ స్టార్ నాని పగతో రగిలిపోతున్నాడు. తన గ్యాంగ్ తో కలిసి పగ తీర్చుకొనేందుకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మెగాస్టార్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బుధవారం విడుదల చేసిన ఈ సినిమా టీజర్ మంచి స్పందన వస్తోంది.

ఇప్పటికే 4 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ లో నిలిచింది గ్యాంగ్ లీడర్ టీజర్. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇక, టీజర్ లో నాని గ్యాంగ్ చేసే పనులు నవ్వులు పూయించాయి. నాని గ్యాంగ్ పగ ఎవరి పైనా ? ఎందుకు ?? అనేది సినిమాలో చూడాలనే హింట్ టీజర్ లో ఇచ్చారు.

ఈ చిత్రంలో సరసన ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నారు. అనిరుథ్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ నిర్మిస్తోంది. ఆగస్టు30న గ్యాంగ్ లీడర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఐతే, అదే రోజుకి ప్రభాస్ సాహో వాయిదాపడటంతో.. గ్యాంగ్ లీడర్ వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ ని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు సమాచారమ్.