కేసీఆర్ టార్గెట్ హరీష్ మాత్రమే
హరీష్ రావుకు రెండోసారి మంత్రి పదవి దక్కపోవడంతో.. ఆయన్ని తెరాస అధిష్టానం టార్గెట్ చేసిందని… కొడుకు కేటీఆర్ కొరకు సీఎం కేసీఆర్ అల్లుడు హరీష్ రావుని టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది నిజమే అంటున్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ. ఆమె గురువారం మీడియాతో ముచ్చటించారు. తెలంగాణ బీజేపీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం కేసీఆర్‌కు హరీష్‌రావే టార్గెట్. హరీశ్‌ను దెబ్బ తీయాలనే సొంత గ్రామం చింతమడకకు కేసీఆర్ వరాలు ప్రకటించారని అరుణ అన్నారు. జూపల్లి కృష్ణారావు ఎక్కడికెళ్లినా జరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల భూములున్న చోటే ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. ‘నేనే రాజు, నేనే మంత్రి’ అన్నట్లు కేసీఆర్ ప్రవర్తన ఉందని అరుణ విమర్శించారు.