వాట్సాప్‌ చెల్లింపు సేవలు.. ఎప్పటి నుంచి ?


ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటివి ఇప్పటికే చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వాట్సాప్ కూడా చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆ కంపెనీ గ్లోబల్‌ హెడ్‌ విల్‌ కాత్‌కార్ట్‌ ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరికల్లా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చి డిజిటల్‌ ఎకానమీలో భాగస్వాములు అవుతామని తెలిపారు.

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఒక్క భారత్ లోనే 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వాస్తవానికి ఇప్పటికే వాట్సాప్ చెల్లింపు సేవలని ప్రారంభించాల్సి ఉంది. ఐతే, డేటా స్టోరేజీ తదితర అంశాలు.. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు నేపథ్యంలో ఆలస్యమవుతోంది.