‘డియర్ కామ్రేడ్’ ప్రీమియర్ షోస్ రికార్డ్ కలెక్షన్స్


యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్. రష్మిక మందన కథానాయిక. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య డియర్ కామ్రేడ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే సినిమా టాక్ బయటికొచ్చింది. కామ్రేడ్ బాగున్నాడు. హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఇక, యుఎస్ లో ఒకరోజు ముందే కామ్రేడ్ సందడి మొదలైంది. ప్రీమియర్ షోస్ ద్వారా కామ్రేడ్ 2.5 లక్షల డాలర్స్ వసూలు చేసింది. ఇది ‘అర్జున్ రెడ్డి’ ప్రీమియర్ షోస్ కంటే అధికం. ఈ యేడాది మహర్షి ప్రీమియర్ షోస్ ద్వారా 5.16 లక్షల డాలర్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 4.83 లక్షల డాలర్లు, ఎఫ్2, 2.59 లక్షల డాలర్ల వసూళ్లలు చేసింది. వీటి తర్వాత స్థానంలో కామ్రేడ్ (2.5 లక్షల డాలర్లు) నిలిచింది. హిట్ టాక్ సొంతం చేసుకొన్న కామ్రేడ్.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ బాషల్లో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోవడం ఖాయమంటున్నారు.