సునీల్ పై హీరో ఫిర్యాదు

‘ఇస్మార్ట్ శంకర్’ వివాదంతో మరోసారి వెలుగులోకి వచ్చాడు హీరో ఆకాష్. ఆయన ఇన్నాళ్లు హీరోగా మాత్రం ప్రేక్షకులకి తెలుసు. ఇస్మార్ట్ శంకర్ వివాదంతో ఆయన రచయి కూడా అని తెలిసింది. ఇక,ఇస్మార్ట్ శంకర్ వివాదంలో ఆకాష్ వాదనకి పసలేదని తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఇది డబుల్ దిమాక్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందనే వార్తలొచ్చాయ్.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని.. కలెక్షన్స్ అదిరిపోయిన తర్వాత ఇస్మార్ట్ కాన్సెప్ట్ నాదే. ఆ కాన్సెప్ట్ తో తమిళ్ లో సినిమా విడుదల చేశా. తెలుగులో విడుదల చేయబోతున్నానని వివాదానికి తెరలేపాడు ఆకాష్. పనిలో పనిగా కమెడియన్ సునీల్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సునీల్ ‘భయ్యా’ అనేవాడు. ఇప్పుడు ఏం ఆకాష్ అంటున్నాడు.

‘అందాల రాముడు’ సినిమాలో నన్ను నటింపచేయడానికి సునీల్ బ్రతిమిలాడాడు. ఆ తర్వాత తన పాత్ర నివిడిని తగ్గించాడు. సునీల్ కి కృతజ్ఞత లేదని వాపోయారు. మొత్తానికి.. ఆకాష్ వివాదాలతో సాధించేది ఏంటన్నది అర్థం కావడం లేదు.