ఘంటా చక్రపాణిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
టీఎస్పీఎస్సీ చైర్మణ్ ఘంటా చ క్రపాణిపై మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జీహెచ్ఎంసీ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నిరుద్యోగ సమస్యపై ఆయన స్పందిస్తూ ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. పనిలో పనిగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని ఆకాశానికెత్తారు.
రాజకీయ నేతలకు పునరావాసం కల్పించే విధంగా కాకుండా గొప్ప మేధావి అయిన ఒక దళిత బిడ్డకు సిఎం కేసిఆర్ టిఎస్పీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. రాజకీయ ప్రాధాన్యం ఉన్న వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తే అవినీతి జరిగే అవకాశం ఉంటుందని, అందుకే ఎలాంటి రాజకీయ ప్రాధాన్యంలేని చక్రపాణికి బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయనకు విద్యార్థుల , నిరుద్యో్గుల కష్టాలు తెలుసన్నారు. ఇచ్చిన బాధ్యతను ఆయన బాగా నిర్వహిస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.