వైరల్ : యువరాజ్‌ నాటౌట్‌ (వీడియో)

యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టాడు. రిటైర్మెంట్ తర్వాత యూవీ గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నాడు. టొరంటో నేషనల్స్‌ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. టొరొంటో నేషనల్స్xవాంకోవర్‌ నైట్స్‌ మ్యాచ్‌లో యూవీ అనూహ్యరీతిలో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియఅలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ లో చీమా వేసిన 17 ఓవర్‌లో యువరాజ్‌ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, అది బ్యాట్‌కు తగలలేదు. బంతి కీపర్‌ చేతికి తాకి వికెట్లకు తగిలింది. అప్పటికీ అతని కాలు క్రీజ్‌లోనే ఉంది. కానీ యువరాజ్‌ ఔట్‌గా భావించి అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూడకుండానే మైదానాన్ని వీడాడు. టొరంటో నేషనల్స్‌పై వాంకోవర్‌ నైట్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.