బిగ్ బాస్3 : పెళ్లాం గొడవ.. తప్పెవరిది ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తొలివారం పూర్తికాకముందే రంజుగా మారింది. హౌస్ పెళ్లాం గొడవ మొదలైంది. వరుణ్ తేజ్ భార్య వితికాను మహేష్ విట్టా గెలికాడు. ‘పో’ అంటూ తనదైన యాసలో కాస్త గట్టిగా అనడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్న వరుణ్.. తన పెళ్లాన్నే అంటావా ? అంటూ మహేష్ పైకి వెళ్లాడు. పెళ్లాంని అంటే ఎవరికైనా కోపం వస్తుందని కాస్త తగ్గిన మహెష్ వరుణ్, వితికాని క్షమాపణలు చెప్పేందుకు వెళ్లినా.. అక్కడ కాస్త డ్రామా జరిగింది.
గురువారం, శుక్రవారం కూడా హౌస్ లో వరుణ్ తేజ్ పెళ్లాం గొడవ కొనసాగింది. ఫైనల్ గా మహేష్.. వరుణ్ కి క్షమాపణలు చెప్పాడు. దాన్ని వరుణ్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఈ గొడవలో తప్పెవరిది ? ఈ వ్యవహారంలో హోస్ట్ నాగార్జున ఎవరిని సపోర్ట్ చేస్తాడు ? ఎవరికి క్లాస్ పీకుతాడు ?? అనేది శనివారం ఏపీసోడ్ లో తెలవనుంది. ఇక శుక్రవారం నాటి ‘కళాకారులం.. మేం కళాకారులం’ అనే స్కిట్ మంచి వినోదాన్ని పంచింది.