‘డియర్ కామ్రేడ్’పై బ్యాన్ డిమాండ్

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన కథానాయిక. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం కామ్రేడ్ దక్షిణాది అన్ని బాషల్లో విడుదలయ్యాడు. మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొన్నాడు. కన్నడలో ఏకంగా డియర్ కామ్రేడ్ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ప్రాంతీయ బాషపై వారికి గల అభిమానమే కారణం. కన్నడంలో దబ్ చేసిన థియేటర్ ల కన్నా తెలుగు వెర్షన్ కి ఎక్కువ థియేటర్లు దక్కాయి.

కన్నడ వెర్షన్ కు గానూ ఐదు థియేటర్ లలో 8 షోలు మాత్రమే బెంగళూరు నగరంలో ప్రదర్శిస్తూ ఉండగా , అదే తెలుగు వెర్షన్ ను 65 థియేటర్లలో 250 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇది కన్నడిగులకి నచ్చలేదు. దీంతో డియర్ కామ్రేడ్ ని కర్ణాటకలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ.. కన్నడ వర్షన్ కామ్రేడ్ థియేటర్స్ పెంచుతారా.. ? కామ్రేడ్ ని మొత్తానికి కర్ణాటకలో బ్యాన్ చేస్తారా ? అన్నది చూడాలి.