అమిత్ షాకు తెలంగాణలో సభ్యత్వం.. వెనక !


తెలుగు రాష్ట్రాల్లో భాజాపా బలోపేతానికి ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణ నుంచి ఇతర పార్టీ నేతలని భారీగా చేర్చుకొంటున్నారు. ఏపీలో తెదేపా నేతలు, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు భాజాపాలోకి క్యూ కట్టబోతున్నారని సమాచారమ్. ఇక, తెలంగాణలో పార్టీ బలోపేతానికి స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగబోతున్నాడు.

ఇందులో భాగంగా తెలంగాణలోనే పార్టీ క్రీయాశీల సభ్యత్వం తీసుకోనున్నాడు. హైదరాబాద్ లో కానీ లేదా చుట్టుపక్కల జిల్లాల్లో ఆయన సభ్యత్వం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నాయి. స్వయంగా అమిత్ షానే తెలంగాణ భాజాపా వ్యవహారాలు చూసుకొంటే.. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రజలకు సైతం బీజేపీపై నమ్మకం పెరుగుతోంది. తద్వారా తెలంగాణ లో కేసీఆర్ క్రేజ్ ని దాటుకొని ప్రజలు భాజాపాకి ఆకర్షితులవుతారు. ఇదే ప్లాన్ తో షా తెలంగాణలో సభ్యత్వం తీసుకోనున్నారని రాజకీయ విశ్లేషకుల మాట. ఇదీ నిజమే..!