రౌడీని ఫాలో అవుతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు రౌడీ విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నాడు. విజయ్ దేవరకొండ ‘రౌడీ’ బ్రాండ్ తో దుస్తుల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ కూడా దుస్తుల వ్యాపారం మొదలెట్టబోతున్నట్టు సమాచారమ్.

“మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయట పెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను పోస్ట్ చేసింది” మహేష్ టీమ్. దీన్ని మహేష్ రీ-ట్విట్ చేశారు. ఇందులో మూడు రోజుల కౌంట్ డౌన్ ఉంచారు.

ఈ పేజ్ లో కింది భాగంలో రకరకాల దుస్తులు, బ్రాండ్ లు ఉంచారు. దీన్ని బట్టి చూస్తుంటే మరో మూడు రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మహేష్ బ్రాండ్ పేరేంటీ ? ఇది మహేష్ సొంత బిజినెస్ యేనా ? మరొకరితో కలిసి చేస్తున్నారా?? అనే విషయల్లో క్లారిటీ రావాల్సి ఉంది.

ఇప్పటికే మహేష్ ‘ఏఎంబీ’ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ని నడుపుతున్నారు. నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక, హీరోగా ఒక్కో సినిమా కోసం రూ. 50కోట్ల పారితోషికం తీసుకొంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం రెమ్యూనరేషన్ కిందకే పోనున్నాయి. మొత్తంగా మహేష్ గట్టిగా సంపాదించేస్తున్నాడు.