ఏపీ ఎమ్మెల్యేల‌కు పెద్ద చిక్కొచ్చిప‌డింద‌ట‌..

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ జ‌రిగిందట‌. స‌భ విరామ స‌మ‌యంలో అనేక విష‌యాలు చ‌ర్చించుకున్నార‌ట‌. అందులో పెళ్లిళ్ల సీజ‌న్, ముహూర్తాల‌పై కూడా చ‌ర్చ వ‌చ్చింద‌ట‌. ఎవ‌రైనా స‌రే తెలిసిన వారి పెళ్లికి ఆహ్వానం ఇచ్చారంటే వారి పెళ్లికి ఖ‌చ్చితంగా వెళ్లిరావాల్సిందే అనుకుంటారు. మ‌రీ అంత‌లా వీలుకాక‌పోతే క‌నీసం పెళ్లిలో అలా క‌నిపించి రావాల‌నుకుంటారు. స‌రిగ్గా ఇప్పుడు ఏపీ అధికార‌పార్టీ ఎమ్మెల్యేల‌కు అదే చిక్కొచ్చిప‌డిందట‌.

ఈనెల 23, 24 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండటంతో నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరుగతున్నాయ‌ట‌. ఆ రోజుల్లో అసెంబ్లీ నడిస్తే వాటికి వెళ్లడమెలా అంటూ దీర్ఘాలోచ‌న‌లో ప‌డిపోయార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో పెళ్లికి వెళితే ఆ కుటుంబాల‌కు త‌మ‌పై గౌర‌వ‌భావం పెర‌గ‌డ‌మే కాకుండా పైగా సంతోషంతో ఉంటారు క‌దా అని చెప్పుకొచ్చార‌ట స‌హ‌చ‌రుతో. ఒకానోక ఎమ్మెల్యేకైతే ఏకంగా ముప్పైకి పైగా పెళ్లికార్డులు వ‌చ్చాయ‌ని, అసెంబ్లీ ఉంటే ఎలా వెళ్లేద‌ని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. నిజంగా ఏపీ అధికార‌పార్టీ ఎమ్మెల్యేల‌కు పెద్ద చిక్కే వచ్చిప‌డింది క‌దూ..