ఆశపడి భంగపడ్డ అసమ్మతి ఎమ్మెల్యేలు
ఆశ ఉండొచ్చు. కానీ అత్యాశ ఉండకూడదు అంటారు. అత్యాశపడిన కర్ణాటక కూటమి పార్టీలకు చెందిన 17మంది ఎమ్మెల్యేలకి స్వీకర్ రమేకు కుమార్ షాక్ ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో 2023 వరకు పోటీ చేసే అవకాశమే లేదు. గతేడాది సెప్టెంబర్ నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న రామలింగారెడ్డికి తొలుత రాజీనామా ఆలోచన వచ్చింది. ఆయన అలకకు కారణం లేకపోలేదు. ఏళ్ల పాటు పార్టీని నమ్ముకుని ఉన్న ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో రాజీనామా చేశారు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆయనను చూసి మరికొందరు రాజీనామా చేశారు. పార్టీ నేతలు రంగంలోకి దిగి రామలింగారెడ్డిని ఒప్పించి వెనక్కి తీసుకురాగలిగారు. కానీ ఈలోపు మిగతా అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల మీద ఆశ కలిగింది. కూటమి నేతలు ఎంత బతిమిలాడిన అలకవీడలేదు. ట్రబుల్ షూటర్ శివకుమార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితించింది. చివరకు స్పీకర్ కూడా అసమ్మతి ఎమ్మెల్యేలా సమయం ఇచ్చి చూశారు. బుజ్జగించి విసిగి వేసారిపోయిన స్పీకర్ రెబల్స్ ఆశల రెక్కలను తెగ నరికారు. దీంతో మంత్రి పదవుల మాట దేవుడెరుగు.. ఎమ్మెల్యే పదవి కూడా ఉడిపోయింది.
తాజాగా స్పీకర్ తీసుకొన్న నిర్ణయం అటు కాంగ్రెస్, జేడీ(యూ), ఇటు బీజేపీని సంతృప్తి పరిచింది. ఇన్నాళ్లు బతిమాలిడిన అలక వీడని అసంతృప్తి ఎమ్మెల్యేలకి జరగాల్సిన శాస్త్రీ జరిగిందని కూటమి నేతలు ఆనందపడుతున్నారు. ఇక, 17మంది ఎమ్మెల్యేలపై వేటుతో సోమవరం శాసనసభలో యడ్యూరప్ప బలనిరూపణకి ఈజీ అయింది.