ఆ విషయంలో జగపతి బాబు నుంచి నో రెస్పాన్స్…
హైదరాబాద్ ఐమాక్స్ వద్ద జరిగిన వాక్ ఫర్ కాజ్ లో జగపతి బాబు పంచెకట్టులో తలుక్కున మెరిసారు. రచయిత మూవీ పోస్టర్ ను ఆవిష్కరించి మూవీ ప్రమోషన్ కు అంబాసిడర్ గా నిలిచారు. ఆదరణ లేక మంచి సినిమాలు చచ్చిపోతున్నాయని, చిన్న సినిమాలను ఆదరించాలని పిలుపు నిచ్చారు జగపతి. ఈ కారణంతోనే కాజ్ ఫర్ వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తాను చేస్తుంది ప్రొటెస్ట్ అనుకోవద్దని, అన్యాయం జరుగుతుందని అనుకోవద్దు కానీ చిన్న సినిమాల్ని బతికించుకోవాలని అన్నారు. తాను చేస్తున్న వాక్ కి వైజాగ్, విజయవాడ లో మంచి సపోర్ట్ వచ్చిందని, ఈ మూవీ కథ నచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ వారికి సపోర్ట్ చేస్తున్నానంటూ చెప్పేశారు.
ఈ మధ్య జగపతిబాబు పాలిటిక్స్ ఎంట్రీపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. పాలిటిక్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. అయితే నందీ అవార్డుల ఎంపిక విషయంలో మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు జగపతి బాబు. ఎలాంటి కామెంట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.