‘బచ్చన్ పాండే’ పవన్ సినిమా రిమేకా ?


బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కొత్త సినిమా ‘బచ్చన్ పాండే’ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. వైరల్ అయింది. ఇందులో అక్షయ్ నుదిటి ఫై విబూది,మెడలో గోల్డ్ చైన్లు, మోకాళ్ళ పైవరకు ఉన్న నల్లని పంచె కట్టుకొని మల్లయోధుడిలా కనిపించాడు. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ రిమేక్ అంటున్నారు.

2017లో ‘కాటమరాయుడు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహించారు. పవన్ – శృతి హాసన్ జంటగా నటించారు. ఐతే, కాటమరాయుడు పవన్ అభిమానులని పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయింది. అన్నట్టు కాటమరాయుడు తమిళ్ హిట్ ‘వీరం’కు రిమేక్. అజిత్ హీరోగా వచ్చిన వీరం సూపర్ హిట్ అయింది. ఐతే, తెలుగులో మాత్రం వీరం రిమేక్ కాటమరాయుడు ఆకట్టులేకపోయాడు. మరీ.. ఇపుడీ కథ బాలీవుడ్ కి వెళ్లనుంది. అది కూడా అక్షయ్ హీరోగా.

‘బచ్చన్ పాండే’ చిత్రానికి ఫర్హాద్ సామ్జి దర్శకత్వం వహించనున్నారు. సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ‘బచ్చన్ పాండే’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక అక్షయ్ నటించిన ‘మిషన్ మంగళ్’ ఆగస్టు 15న విడుదలకానుంది.