మహేష్ బట్టల బ్రాండ్ ఏంటో తెలుసా ?
సూపర్ స్టార్ మహేష్ బాబు బట్టల బిజినెస్ మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వెబ్ సైట్ లింకుని ఇటీవలే మహేష్ టీమ్ షేర్ చేసింది. దాన్ని తిరిగి షేర్ చేసిన మహేష్ మూడు రోజుల కౌంట్ డౌన్ ఉంచారు. ఇప్పుడీ కౌంట్ డౌన్ పూర్తయింది. మహేష్ బట్టల బ్రాండ్ ని ఏంటన్నది రివీల్ చేశారు. #HUMBL బ్రాండ్ తో మహేష్ దుస్తుల బిజినెస్ చేయనున్నారు. ఆగస్టు7 #theHUMBLco బ్రాండ్ ని మహేష్ ప్రారంభించబోతున్నాడు.
ప్రస్తుతం మహేష్ “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే తొలిషెడ్యూల్ కశ్మీర్ లో పూర్తి చేసుకొంది. త్వరలోనే హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రజౌ-అనిల్ సుంకర్-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానునున్నారు.
Presenting you all The #HUMBL, Our very own Superstar @urstrulyMahesh's Clothing Brand. Just like our Superstar It's Honest,Real and Confident. Stay tuned for the brand launch on 7th August ! #theHUMBLco @thehumblco pic.twitter.com/101kFJfhIp
— BARaju (@baraju_SuperHit) July 29, 2019