కోహ్లీ-రోహిత్ గొడవ.. బాధ్యత రవిశాస్త్రిదే !
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ మధ్య విబేధాలు వాస్తవమేనని తేలిపోయింది. ఐతే, ఇందుకు కారణాలేంటీ అనేది మాత్రం తెలీదు. ఆ విభేదాలను తొలగించే బాధ్యత మాత్రం కోచ్ రవిశాస్త్రీ మీద పెట్టబోన్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయనుంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లను విండీస్‌తో భారత్.. యూఎస్‌లో తలపడనుంది. ఐతే, వచ్చే వారంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి కూడా యూఎస్‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.
కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడి విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా రాహుల్ జోహ్రి ఆటగాళ్లతో మాట్లాడకుండా.. కోచ్ రవిశాస్త్రిని మాట్లాడించే అవకాశం ఉంది. ధోనీ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు. ఆ సమయంలో రవిశాస్త్రి జట్టుతోనే ఉన్నాడు. జట్టులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అందర్నీ ఒక తాటిపైకి తీసుకవచ్చాడు. ఇప్పుడు కూడా జట్టులోని విబేధాలు పరిష్కరించే బాధ్యతని రవిశాస్త్రీకి అప్పగించనున్నారు.