మహేష్ ఆర్డర్.. నిర్మాతలకి మరింత భారం !

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర్-దిల్ రాజు-మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో మినరల్ వాటర్ కాకుండా రెగ్యులర్ వాటర్ ఇవ్వడం మీద మహేష్ కోప్పడిపోయారు. చిత్ర యూనిట్ కి మొత్తం మినరల్ వాటర్ ఇవ్వాలని ఆర్డర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ ఫన్నీగా వున్నాయి.

మహేష్ ఆర్డర్ తో నిర్మాతలకి మరింత భారం కానుంది. సినిమా యూనిట్ లు, సినిమా ఆఫీసులు, అన్నింటా పాతిక లీటర్ల క్యాన్ లు తెప్పించి.. వాటిని వాటర్ బాటిళ్లలో పట్టి వుంచుతారు. మహేష్ బాబు సినిమా షూట్ లో కూడా అదే చేస్తున్నారు. స్టార్ లకు మాత్రం మినరల్ వాటర్ బాటిళ్లు ఇస్తున్నారు. ఈ తేడాపై మహేష్ మండిపడ్డారట. ఇకపై అందరికీ మినర్ వాటర్ బాటిల్స్ అందివ్వాలని ఆర్డర్ వేశారట. ఇది నిర్మాతలకి మరింత భారం కానుంది. సినిమాకు మహేష్ కూడా సహ నిర్మాత. కానీ, ఆయనకి నష్టాలు ఉండవు.

బడ్జెట్ తో సంబంధం లేదు. ఎందుకంటే ? మహేష్ తన వాటా క్రింద నాన్ థియేట్రికల్ రైట్స్ తీసుకొంటారు. అంటే సినిమా విడుదలకి ముందే మహేష్ కు లాభాలు వస్తాయి. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే సినిమా బడ్జెట్, నిర్మాతల లాభాలు రావాలి. అలాంటప్పుడు మహేష్ అందరికీ మినరల్ వాటర్ లాంటి ఆర్డర్లు వేసి.. ఔదార్యం చాటుకొంటే ఎలా ? కావాలంటే.. ఆయన సొంత ఖర్చులతో మినరవాల్ వాటర్ అందించేలా చర్యలు తీసుకొంటే బాగుంటుందని మిగితా నిర్మాతలు గుసగుసలాడుకొంటున్నారు.