చిరుతో తమన్నా, శృతి, కాజల్.. !

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ ‘సైరా’ రిలీజ్ ఉండనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, కొరటాల సినిమాపై ఫోకస్ పెరిగింది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా ముందుగా మిల్కీ బ్యూటీ పేరు వినిపించింది. చిరంజీవితో నటించాలన్నది తమన్నా చిరకాల కోరిక. ‘రచ్చ’ సినిమా సమయంలోనే తన కోరికని బయటపెట్టింది తమ్మూ. ఆమెతో రొమాన్స్ చేసేందుకు చిరు కూడా ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో చిరు-కొరటాల సినిమాకి తమ్మూ ఫిక్స్ అనుకొన్నారు.

ఆ తర్వాత శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ నటించింది. ఇదీగాక శృతి పర్సనాలిటీ చిరుకి సరిగ్గా సరిపోయేలా ఉంటుందని అందరు అనుకొన్నారు. కొరటాల రిఫరెన్స్ తో చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ శృతిపై కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. లేటెస్ట్ గా ఇప్పుడు శృతిహాసన్ పేరు కూడా మాయమైంది. ఆమె స్థానంలో ఫ్రెష్ గా కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. మరీ.. కాజల్ ఫైనల్ అవుతుందా ? మరో అమ్మాయి పేరు తెరపైకి వస్తుందా ?? అన్నది చూడాలి.