బన్నీ కూడా బట్టల బిజినెస్.. !
టాలీవుడ్ స్టార్స్ కి బట్టల పిచ్చి పట్టుకొన్నట్టుంది. వరుసపెట్టి బట్టల బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. రౌడీ వేర్ అంటూ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ క్లోత్ బ్రాండ్ ను స్టార్ట్ చేశాడు. ఇది విజయ్ సొంత వ్యాపారం ఏమీ కాదు. వేరెవరితోనో కలిసి స్టార్ట్ చేశారు. బాగానే క్లిక్ అయినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిల కోసం కూడా రౌడీ బ్రాండ్ ని తీసుకొస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బట్టల వ్యాపారం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. హంబుల్ బ్రాండ్ తో మహేష్ బట్టల వ్యాపారం చేయనున్నాడు. ఆగస్టు 7 హంబుల్ బ్రాండ్ ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించేశారు. ఇప్పుడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి కూడా సరికొత్త బట్టల బ్రాండ్ రాబోతుంది. ‘STAAR’ బ్రాండ్ తో బన్నీ బట్టల వ్యాపారం చేయబోతున్నాడు. ఆగస్టులోనే ఆ బ్రాండ్ ని ప్రారంభించబోతున్నట్టు బన్నీ ఫ్యాన్స్ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐతే, దీనిపై బన్నీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నాన్న నేను అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకాగా బన్నీ-త్రివిక్రమ్ సినిమా విడుదల కానుంది.