ట్రాఫిక్ సీఐని కాలితో తన్నిన ఎమ్మెల్యే కొడుకు.. !

ఎమ్మెల్యే కొడుకు ట్రాఫిక్ పోలీసులపై బలుపు చూపించాడు. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై నోటి దురుసు చూపించాడు. సర్థి చెప్పేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ సీఐని తోసేశాడు. కాలితో తన్నాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 9గంటలకి మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ కృష్ణ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలను ఉల్లంఘించిన ముందుకు వెళుతుండగా కానిస్టేబుల్‌ కృష్ణ అడ్డుకుని వారించాడు. ఆ వాహనంలో ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్ బయటకు దిగి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. నోటికొచ్చినట్టు తిట్టాడు.

ఇంతలో ట్రాఫిక్‌ సీఐ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని అతడిని వారించే ప్రయత్నం చేశాడు. సామినేని ప్రసాద్‌ పోలీస్ స్టేషన్ కి రావాల్సిందిగా కోరాడు. నన్నే స్టేషన్ కి రమ్మంటావా అంటూ.. సామినేని ప్రసాద్ రెచ్చిపోయాడు. సీఐ సీఐను పక్కకు నెట్టేసి, కాలుతో తన్ని తిట్లపురాణం అందుకున్నాడు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై ఐపీసీ సెక్షన్లు 332, 353, 506 కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..