‘వెంకీమామ’ మేకింగ్ చూశారా ?
బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. దర్శకుడు బాబీ పుట్టినరోజు కానుకగా గురువారం వెంకీమామ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబ్రందం. ఎలాంటి ముందస్తు అప్ డేటు ఇవ్వకుండా సడెన్ సప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియోలో ఇద్దరు కథానాయకులు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. దీంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.
ఎమోషనల్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది. వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్ , నాగచైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 4న వెంకీమామ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాతో ‘వెంకీమామ’ బాక్సాఫీస్ ఫైట్ తప్పేలా లేదని చెబుతున్నారు.